- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో వచ్చేది బీజేపీ పార్టీ
బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు యువకులు ఆకర్షితులై పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయని, తెలంగాణలో పార్టీ బలోపేతానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావు అన్నారు.

దిశ, తుర్కయంజాల్ : బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు యువకులు ఆకర్షితులై పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయని, తెలంగాణలో పార్టీ బలోపేతానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావు అన్నారు. శనివారం ఆదిభట్ల సర్కిల్ మన్నెగూడ జిఎంఆర్ కన్వెన్షన్ హాల్లో స్పూర్తి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బాసరాజు సురేష్ ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ల సమక్షంలో దాదాపు 300 మందితో కలిసి బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎన్. రామచంద్రరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ లు కావాలనే బీజేపీ పార్టీ పై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఆరు గ్యారెంటీ లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో విఫలయ్యారన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో రైతులు, యువత, మహిళలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలు మార్పు కోరుకుంటూ బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు బీజేపీలో తగిన గౌరవం, గుర్తింపు ఉంటుందని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా అవతరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు రాజ్ భూపాల్ గౌడ్, సీనియర్ నాయకులు బోసుపల్లి ప్రతాప్, నోముల దయానంద్ గౌడ్, అందేల శ్రీరాములు, బచ్చిగళ్ళ రమేష్, కొప్పు భాషా, కొత్త అశోక్ గౌడ్, ఎలిమినేటి నరసింహారెడ్డి, అర్జున్ రెడ్డి, కొత్త రామ్ రెడ్డి, బలదేవ్ రెడ్డి, కరాడి శ్రీలత అనిల్ కుమార్, నోముల కార్తీక్ గౌడ్, మల్లెల ప్రేమ్ కుమార్, మైలారం బాబు, దార వెంకటేష్, నందగిరి సురేష్, విశాల్, కుంభం శివ పాల్గొన్నారు.






