సామాన్యుల‌కు బిగ్ షాక్‌...50 రోజులుగా కొత్త కనెక్షన్లు నిల్

by velandi.Saikiran |   (  Updated:2026-05-10 22:30:32  IST  )

అంతర్జాతీయంగా కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ఇప్పుడు సామాన్యుడి వంటగదిపై పడింది.

సామాన్యుల‌కు బిగ్ షాక్‌...50 రోజులుగా కొత్త కనెక్షన్లు నిల్
X

50 రోజులుగా కొత్త కనెక్షన్లు నిల్

l మర్పల్లిలో గ్యాస్ సెగలు..

50 రోజులుగా నిలిచిన కొత్త కనెక్షన్లు

l దిగుమతులు తగ్గడంతో

ఏర్పడిన గ్యాస్ సంక్షోభం

l బుకింగ్ చేసినా 45 రోజులు వేచి చూడాల్సిందే

l ఓటీపీ రాక, మొబైల్ లింక్ అవ్వక

లబ్ధిదారుల విలవిల

దిశ, మర్పల్లి : అంతర్జాతీయంగా కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ఇప్పుడు సామాన్యుడి వంటగదిపై పడింది. గ్యాస్ దిగుమతులు గణనీయంగా తగ్గిపోవడంతో ఒక్క సారిగా గ్యాస్ సంక్షోభం త లెత్తింది. దీని ప్రభావం వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రమలో స్పష్టంగా కనిపిస్తోంది. కొ న్ని రోజులుగా కొత్త గ్యాస్ కనెక్షన్ మంజూరు ని లిచిపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు.

నిలిచిన కొత్త కనెక్షన్లు..

మర్పల్లి మండల కేంద్రం లోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ పరిధిలో సుమారు 11,350 గ్యాస్ కనెక్ష న్లు ఉన్నాయి. గతంలో కొత్త కనెక్షన్ కావా లంటే ఏజెన్సీ వారే గ్రామాలకు వ చ్చి స్పెషల్ డ్రైవ్‌లు ని ర్వహించి మరీ కనెక్షన్లు ఇచ్చేవారు. కానీ ప్ర స్తుతం పరిస్థితి తలకిందులైంది. మార్చి 11వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో కొత్త కనెక్ష న్లు, డబుల్ సిలిండర్ దరఖాస్తుల ప్రక్రియను నిలిపివేశారు. గత 50 రోజులుగా ఏజెన్సీ చుట్టూ తి రుగుతున్నా పైనుంచి అనుమతులు లేవు అనే సమాధానం వస్తుండటంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో గ్యాస్ బుక్ చేసుకు న్న వెంటనే సిలిండర్ డెలివరీ అయ్యేది, కానీ ఇ ప్పుడు బుకింగ్ చేసుకున్న తర్వాత కనీసం 45 రోజులు గడిస్తే తప్ప సిలిండర్ పొందే అవకాశం లేకుండా పోయిందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకే సిలిండర్ ఉన్నవారు గ్యా స్ ఎప్పుడు అయిపోతుందోనని భయంతో గ్యాస్ ఏజెన్సీ ముందు నిత్యం బారులు తీరుతున్నారు. డబుల్ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకుందామ న్నా వెబ్‌సైట్ పని చేయకపోవడం గమనార్హం.

వేధిస్తున్న సాంకేతిక సమస్యలు..

సాంకేతిక నిబంధనలు కూడా సామాన్యుడిని వేధిస్తున్నాయి. ప్రస్తుతం గ్యాస్ బుకింగ్ సమయంలో వినియోగదారుడి ఫోన్‌కు ఓటీపీ (OTP) వస్తేనే సిలిండర్ ఇచ్చే నిబంధన అమల్లోకి వచ్చింది. అ యితే, చాలామంది పాత వినియోగదారుల ఫోన్ నంబర్లు ఆన్‌లైన్‌లో నమోదు కాకపోవడంతో వా రికి ఓటీపీ రావడం లేదు. గతంలో మొబైల్ లింక్ లేకపోయినా సులభంగా గ్యాస్ ఇచ్చేవారని, ఇప్పు డు ఫోన్ నంబర్ లింక్ ఉంటేనే గ్యాస్ ఇస్తామన డం తమకు శాపంగా మారిందని వినియోగదారులు వాపోతున్నారు. మండల కేంద్రంలోని గ్యా స్ వినియోగదారుల సమస్యలను గుర్తించి, నిలిచిపోయిన కొత్త కనెక్షన్లు తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. అలాగే బుకింగ్ ప్రక్రియను సరళతరం చే సి, గ్యాస్ కొరతను తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story