కౌకుంట్ల గ్రామంలో బెల్ట్ షాపుల నిషేధం.. ఏకగ్రీవ తీర్మాణం

by Ratna Kumari |

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామంలో గురువారం మహిళా సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో సర్పంచ్, సెక్రెటరీ అధ్యక్షతన బెల్ట్ షాపుల నిర్మూల‌న‌కు ఏక గ్రీవ తీర్మానం చేశారు.

కౌకుంట్ల గ్రామంలో బెల్ట్ షాపుల  నిషేధం.. ఏకగ్రీవ తీర్మాణం
X

దిశ‌, చేవెళ్ల : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామంలో గురువారం మహిళా సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో సర్పంచ్, సెక్రెటరీ అధ్యక్షతన బెల్ట్ షాపుల నిర్మూల‌న‌కు ఏక గ్రీవ తీర్మానం చేశారు. బెల్ట్ షాపులలో విచ్చలవిడిగా మద్యం లభించడం వల్ల ప్రజలు అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. చాలా మంది ప్రాణాలు సైతం కోల్పోయారని, చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయాన్నారు. బెల్ట్ షాపులను నిషేదిస్తే ప్ర‌జ‌లు మ‌ద్యానికి బానిస కార‌న్నారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించి అమ్మిన వారిపై రూ.ల‌క్ష వ‌ర‌కు జ‌రిమానా, కొన్న వారి పై రూ.50వేలు జరిమానా, పట్టించిన వారికీ రూ.10,000 పారితోషికం ఇస్తామని తెలిపారు. ఈ నిర్ణయానికి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి, సెక్రటరీ సునీత, పాలక వర్గం సభ్యులు, యువజన సంఘాల సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Next Story