గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

by Disha Web Desk 15 |
గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం
X

దిశ, యాచారం : గురుకుల పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాలకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ కూకుట్ల యాదయ్య మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాలు మల్కాజ్ గిరి ఏదులాబాద్, ఘట్కేసర్, ఫైన్ ఆర్ట్స్ పాఠశాలల వివిధ విభాగాలలో 6వ తరగతి ప్రవేశాల కొరకు బాలబాలికల

నుండి 2024-25 విద్యా సంవత్సరానికి ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. చివరి తేదీ 18 ఏప్రిల్ వరకు ఉందని, ప్రవేశ పరీక్ష మే 5న ఉందని వివరించారు. సందేహాలకు టోల్ ఫ్రీ నెంబర్ 180042545678 ను సంప్రదించవచ్చునని తెలిపారు. అలాగే గురుకులాల్లో ఖాళీగా ఉన్న 7, 8, 9 తరగతులకు కూడా నోటిఫికేషన్ విడుదలైందని, 23 మార్చి వరకు దరఖాస్తు చేసుకోవాలని ఏప్రిల్ 21 ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందని అన్నారు.


Next Story