- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ బస్సులో ఊడిన స్టీరింగ్ రాడ్డు.. తప్పిన పెను ప్రమాదం
by Muthe.Rajitha |
ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా స్టీరింగ్ ఊడిపోయింది. దీంతో బస్సు ఒక్కసారిగా నడి రోడ్డుపై నిలిచిపోయి.. పెను ప్రమాదం తప్పింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా స్టీరింగ్ ఊడిపోయింది. దీంతో బస్సు ఒక్కసారిగా నడి రోడ్డుపై నిలిచిపోయి.. పెను ప్రమాదం తప్పింది. వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని లక్ష్మీనారాయణపూర్ చౌరస్తా సమీపంలో తాండూరు డిపో ఆర్టీసీ అద్దె బస్సు మహబూబ్‌నగర్ వెళ్తుండగా.. లక్ష్మీనారాయణపూర్ చౌరస్తా సమీపంలోకి రాగానే స్టీరింగ్ రాడ్ బోల్టు ఊడిపోయింది.
దీంతో బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. జాతీయ రహదారిపై బస్సు వేగంగా వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగి ఉంటే.. తమ పరిస్థితి ఏంటని పలువురు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం సంభవించ లేదని, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మరొక బస్సులో వారి గమ్యస్థానాలకు పంపామని డిపో మేనేజర్ తెలిపారు.
Next Story






