- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా డాడీని కిడ్నాప్ చేశారు
బీఆర్ఎస్ 19 వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని కిడ్నాప్ చేశారని ఆయన కుమారుడు ఆకుల హరినాథ్ ఆరోపించారు.

దిశ, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలో సోమవారం ప్రమాణ స్వీకారానికి రాకుండా బీఆర్ఎస్ 19 వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని కిడ్నాప్ చేశారని మంగళవారం ఆయన కుమారుడు ఆకుల హరినాథ్ (టోనీ) మున్సిపాలిటీ కేంద్రంలో ఆరోపించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, గడ్డన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ లో ఉన్న కౌన్సిలర్లు అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. ఇష్టం లేకున్నా బలవంతంగా వాళ్ళని బెదిరించి చైర్మన్ ను ఎన్నుకుంటున్నారని అయన తెలిపారు.
కాగా ఎవరిని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ పార్టీ నుండి చైర్మన్ ను ఎన్నుకుంటామని మధుసూదన్ రెడ్డి విలేకరుల సమావేశంలో దీమ వ్యక్తం చేశారు. కాగా బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి షుగర్ పేషంట్ అని తెలిసి కూడా కనికరం లేకుండా బీఆర్ఎస్ వాళ్లు కుటుంబ సభ్యులకు తెలియకుండా దాచడం అనేది క్రూరత్వానికి నిదర్శనమని అయన విమర్శించారు. బుధవారం కోర్టులో హాజరుపరిచి బీఆర్ఎస్ నాయకుల దౌర్జన్యాలను ఎండ కడతామని అయన పేర్కొన్నారు.






