వ్యవసాయ మోటర్ల కేబుల్‌ వైర్‌ చోరీ..

by Kodari Anjali |

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం తాళ్ళపల్లిగూడ గ్రామంలో రైతుల వ్యవసాయ మోటర్ల వైర్‌ చోరీకి గురయ్యాయి.

వ్యవసాయ మోటర్ల కేబుల్‌ వైర్‌ చోరీ..
X

దిశ, మంచాల: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం తాళ్ళపల్లిగూడ గ్రామంలో రైతుల వ్యవసాయ మోటర్ల వైర్‌ చోరీకి గురయ్యాయి. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సుమారు 8 మంది రైతుల వ్యవసాయ మోటర్ల వైర్లు దొంగలు కత్తిరించుకుపోయారు. గురువారం, శుక్రవారం నాడు ఈ దొంగతనాలు జరిగాయి. ఉదయం రైతులు పొలాలకు నీళ్లు పెట్టెందుకు వెళ్లిన రైతులు గమనించారు. సబ్‌మెర్సిబుల్‌ మోటర్‌ నుంచి మెయిన్‌ బోర్డు వరకు ఉండే కేబుల్‌ వైర్లు కత్తిరించి ఉండడాన్ని చూసి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం 7 మోటర్ల వరకు వైర్లు కత్తిరించారని, రైతులు కుకుడాల అంజి రెడ్డి, గ్రామ పంచాయతీ సంబంధించినది, కసా యాదయ్య, జేల్లయ్య, కుకుడాల వెంకట్ రెడ్డి,మిగతా రైతులు తెలిపారు.

పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు..

ఒక్కో మోటర్‌ వద్ద సుమారు 40,50 మీటర్ల వైరు కత్తిరించారు. ఈ వైరు మీటర్‌కు రూ.200 చొప్పున మోటర్ల నుంచి దాదాపు రూ.లక్షవిలువ కలిగిన వైర్లు కత్తిరించుకెళ్లారని రైతులు వాపోతున్నారు. గతంలో మూడు సార్లు ఇలా కత్తిరించారని ఎవరికి వారు మళ్లీ వైర్లు తెచ్చుకొని వేశామని ఇప్పుడు పంటలు పొట్ట దశలో ఉన్నాయని ఇలాంటి సమయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇప్పుడు ప్రతి మోటర్‌కు రూ.8000 ఖర్చు చేసి కేబుల్‌ వైరు కొనాల్సివస్తుందని, మళ్లీ ఏ రోజు దొంగలు ఎత్తుకెళ్తారో కూడా తెలియదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ జోగు శంకరయ్య శనివారం నాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. పోలీసులు నిఘా పెట్టి దొంగలను పట్టుకొని రైతులను కాపాడాలని వారు వేడుకుంటున్నారు.

Next Story