- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తీర్మానం చేసి విస్మరించి!
మణికొండ ప్రాంతంలో సమీకృత వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు కోసం మూడేళ్ల క్రితం తీసుకున్న ముఖ్యమై న తీర్మానం ఇప్పటికీ అమలు కాని పరిస్థితి స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి రేపుతోంది.

దిశ, గండిపేట: మణికొండ ప్రాంతంలో సమీకృత వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు కోసం మూడేళ్ల క్రితం తీసుకున్న ముఖ్యమైన తీర్మానం ఇప్పటికీ అమలు కాని పరిస్థితి స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి రేపుతోంది. అ ప్పట్లో మణికొండ పాలకవర్గం సర్వే నం. 65లోని మణికొండ జాగీర్ పరిధిలో దాదాపు ఎకరం ప్రభుత్వ భూమిగా గుర్తించి, అ క్కడ సమీకృత మార్కెట్ నిర్మించాలని ని శ్చయించినా, ఆ తీర్మానం కాగితాలకే పరిమితమైంది. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, అధికారుల చిత్తశుద్ధి లేమి కారణంగా ప్రాజెక్టు కు పెద్దపీట వేయకపోవడంతో సమస్య అలాగే మిగిలిపోయింది.
మార్కెట్ ఏర్పాటు కాకపోవడంతో మణి కొండ మున్సిపల్ పరిధిలోని ముఖ్య రహదారులన్నింటిపై కూరగాయల బండ్లు, సంతలు యథేచ్ఛగా ఉండిపోతుండడంతో వా హనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ గంటలకొద్దీ నిలిచిపోవడం, వేధిం పులు, అసౌకర్యాలు సాధారణమైపోయా యి. సమీకృత మార్కెట్ అమల్లోకి వచ్చి ఉండి ఉంటే వీధి వ్యాపారులకు పద్ధతిగా స్థలం దొరికేది, ప్రజలకు టైం సేవ్ అవు తుంది, పట్టణ ట్రాఫిక్‌కు పెద్ద ఊరట కలి గేది. కానీ పాలకవర్గ తీర్మానం ఎవరి దృష్టి ని ఆకర్షించకపోవడంతో ప్రజా ప్రయోజ నం హననమైంది.
ఇదిలా ఉంటే, మార్కెట్ కోసం నిర్ణయించిన అదే భూమిలో ప్రస్తుతం ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ లేబర్ క్యాంప్‌ను ఏర్పాటు చే యడం మరింత వివాదాస్పదంగా మారిం ది. బుల్కాపూర్ నాలా ఆధునీకరణ టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్, ప్రభుత్వం వేల కోట్లు విలువ చేసే ఆ భూమిని చదును చేసి, అక్కడే బోరు కూడా తవ్వించాడని స్థానికులు ఆగ్రహిస్తున్నారు. ప్రభుత్వ భూ మిని ప్రజల అవసరాల కోసం వినియోగించకుండా, ఒక కాంట్రాక్టర్‌కు వాడుకునేలా ఎలా అనుమతి ఇచ్చారు? అని ప్రశ్నిస్తున్నా రు. సమీకృత మార్కెట్‌పై చిత్తశుద్ధి లేకపో గా, విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తి చేతికి అప్పగించడం వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ మణికొండ మున్సిపాలిటీ అధికార ప్రతినిధి బొమ్ము ఉపేంద్రనాథ్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ, మార్కెట్ నిర్మాణం కోసం స్పష్టంగా తీర్మానం ఉన్నప్పుడు భూమి వినియోగం ఎందుకు మార్చారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని సమీకృత మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ భూమిని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.






