- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేవతను కూడా వదలని దొంగలు
by Batti.Sumithra |
మండలంలోని తాడిపర్తి గ్రామంలో కొలువైన తాటికుంట మైసమ్మ దేవాలయంలో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు అమ్మవారి విగ్రహం అపహారించినట్టు ఆ గ్రామ సర్పంచ్ దూస రమేష్ పేర్కొన్నారు.

X
దిశ, యాచారం : మండలంలోని తాడిపర్తి గ్రామంలో కొలువైన తాటికుంట మైసమ్మ దేవాలయంలో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు అమ్మవారి విగ్రహం అపహారించినట్టు ఆ గ్రామ సర్పంచ్ దూస రమేష్ పేర్కొన్నారు.విషయం తెలుసుకున్న యాచారం పోలీసులు తాటి కుంట మైసమ్మ దేవాలయాన్ని సందర్శించారు.
దేవాలయంలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి హుండీ , అమ్మవారి విగ్రహాన్ని అపహరించారు. గతంలో కూడా అమ్మవారి హుండీని ఎత్తుకెళ్లారని స్థానికులు తెలిపారు. తక్షణమే అధికారులు స్పందించి విగ్రహాన్ని దొంగిలించిన దుండగులను పట్టుకోవాలని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






