- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దాయాదుల దాడిలో వ్యక్తి మృతి
భూ వివాదానికి ఓ చిన్న గొడవ తోడవడంతో దాయదుల చేతిలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు.

దిశ, షాద్ నగర్ : భూ వివాదానికి ఓ చిన్న గొడవ తోడవడంతో దాయదుల చేతిలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. షాద్ నగర్ రూరల్ సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. కొందుర్గు మండలం చిన్న ఉమ్మెత్యాల గ్రామానికి చెందిన కలపురం నరసింహులు, కలపురం యాదయ్య, కలపురం నరసింహులు వరుసకు అన్నదమ్మలు. వీరి తాత బీరయ్య ఆస్తుల పంపిణీ విషయంలో భూవివాదం, ఇంటిస్థల వివాదం ఉంది. ఆదివారం ఉదయం సుమారు 9:30 గంటలకు నిందితులలో ఒకరైన కలపురం నరసింహులు తన స్నేహితుడైన సాయిని కొందుర్గు లో దించేందుకు వెళుతుండగా.. తనను వ్యవసాయ పొలం వద్ద దించాలని మృతుడు కోరాడు. దించేందుకు అంగీకరించకపోవడంతో నరసింహులు తో మృతుడు గొడవపడ్డాడు. ఈ విషయాన్ని ఇంటికి వచ్చి తన సోదరుడైన మరో నిందితుడు యాదయ్యకు తెలిపాడు. ఉదయం 11:30 గంటలకు ఇంటికి వచ్చిన మృతుడు నరసింహులు నిందితులిద్దరితో గొడవపడి దాడికి పాల్పడ్డాడు. దీంతో యాదయ్య ఆవేశంలో పక్కనే ఉన్న రోకలి బండతో మృతుడు నరసింహులు పై దాడి చేయగా మృతుని తలకు రక్త గాయాలయ్యాయి. గాయపడిన నరసింహులును చికిత్స నిమిత్తం షాద్ నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.






