బస్సు ఢీకొని వ్యక్తి మృతి

by Ratna Kumari |   (  Updated:2026-02-08 06:42:55  IST  )

అతివేగంగా వచ్చిన బస్సు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

బస్సు ఢీకొని వ్యక్తి మృతి
X

దిశ, యాచారం : అతివేగంగా వచ్చిన బస్సు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాచారం మండ‌లం దాత్ ప‌ల్లి తండ్రా ప‌రిధిలోని వెంకటేశ్వ‌ర‌తండాకు చెందిన జ‌టావ‌త్ హ‌రియా(47), మండల కేంద్రంలోని మొండి గౌరెల్లి చౌరస్తా దగ్గర ద్విచక్ర వాహనంపై యూటర్న్ తీసుకుంటుండగా.. ఎదురుగా అతివేగంగా వచ్చిన దేవరకొండ డిపోకు చెందిన బస్సు ఢీ కొట్టింది. దీంతో హ‌రియా తీవ్ర గాయాల‌పాల‌య్యాడు. చికిత్స కోసం 108 అంబులెన్సులో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యాచారంలో స్టాపు లేదని దేవరకొండ డిపోకు చెందిన బస్సు డ్రైవర్లు నిర్లక్ష్యంగా అతివేగంగా నడుపుతున్నారని దాని ఫలితంగానే ఈ ఘటన చోటు చేసుకుందని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.

Next Story