జీహెచ్‌ఎంపీ పరిధిలో 24 బార్లకు 3520 దరఖాస్తులు.!

by Ajay Maddhiboyina |

మూత పడిన బార్ల పునరుద్దరణకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన నోటిఫికేషన్ కు సంబంధించి 28బార్లకు ధాఖలైన ధరఖాస్తులకు 13వ తేదీన లాటరీ పద్దతిలో ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు హైదరాబాద్‌, రంగారెడ్డి డిప్యూటి

జీహెచ్‌ఎంపీ పరిధిలో 24 బార్లకు 3520 దరఖాస్తులు.!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మూత పడిన బార్ల పునరుద్దరణకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన నోటిఫికేషన్ కు సంబంధించి 28బార్లకు ధాఖలైన ధరఖాస్తులకు 13వ తేదీన లాటరీ పద్దతిలో ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు హైదరాబాద్‌, రంగారెడ్డి డిప్యూటి కమిషనర్లు కేఏబీ శాస్త్రీ, పి.దశరథ్‌ బుధవారం ప్రకటనలో తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 24 బార్లకు 3520 దరఖాస్తులు, రూరల్‌ జిల్లాలో 4 బార్లకు 148 ధరఖాస్తులు వచ్చినట్లు పేర్కొంది. డ్రా కు వచ్చే దరఖాస్తుదారులు వారికి మంజూరు చేసిన ఎంట్రీ పాసుతోపాటు, అవసరమైన నిర్థారణ ప్రూఫ్ తో రావాలని సూచించారు. దరఖాస్తుదారులు ఉదయం 9 గంటల నుంచి సూచించిన అడ్రస్ కు రావాలని తెలిపారు.

లోపలికి వచ్చే వారి సెల్‌ ఫోన్లను అనుమతించబడవని అధికారులు తెలిపారు. దరఖాస్తుదారులకు ఇచ్చిన టోకన్‌ నెంబర్ ఆధారంగా లోపలికి అనుమతిస్తారని తెలిపారు. దరఖాస్తు దారులు అందరికీ వారి మెయిల్ ద్వారా వాట్సాప్ గ్రూపులలో సమాచారాన్ని పంపించినట్లు అధికారులు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని దరఖాస్తులను గండిపేట నార్సింగ్ లోని ది అడ్రస్‌ కన్వెన్షన్స్ అండ్ ఎగ్జిబిషన్ లో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ సి.హరి కిరణ్‌ ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సరూర్‌నగర్‌, జల్‌పల్లి మునిసిపాలిటీలో బార్‌కు రంగారెడ్డి కలెక్టరేట్‌లో కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో, మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒక బారుకు మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌లో కలెక్టర్‌ విజయేంద్ర బోయి సమక్షంలో, నిజామాబాద్‌, బోధన్‌ బార్లకు వచ్చిన దరఖాస్తుదారుల నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో అసిస్టెంట్‌ కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ సమక్షంలో ఎంపిక చేస్తారని తెలిపారు.

Next Story