- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి డంప్ చేసుకొని పక్క రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠా వద్ద నుంచి 300 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న ఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, ఇబ్రహీంపట్నం : రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి డంప్ చేసుకొని పక్క రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠా వద్ద నుంచి 300 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న ఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అఖిల్ అలియాస్ బాబ్లు, మహమ్మద్ అమీర్ పాషా (30), హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలలో రేషన్ బియ్యన్ని తక్కువ రేటుకు సుమారుగా 10 రూపాయల నుంచి 12 రూపాయల చొప్పున కొనుగోలు చేసి బియ్యన్ని ఆటోలలో నింపి, అబ్దుల్లాపూర్ మెట్ మండలం, కవాడిపల్లి గ్రామంలో రహస్య స్థలంలో డంపు చేస్తూ, నిల్వ చేసిన బియ్యాన్ని పక్క రాష్ట్రాలకు తరలించి అక్కడ 18 రూపాయల నుంచి 20 రూపాయల అధిక రేట్లకు విక్రయిస్తున్నట్లు పక్క సమాచారంతో అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు రేషన్ బియ్యన్ని డంపు చేస్తున్న స్థలంపై దాడి నిర్వహించారు. ఈ ఘటన మొత్తం 510 సంచులలో సుమారుగా 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం, ఒకటి కంటెనర్ లారీ (టీఎస్ - 02- యుసి -2829), ఆటో (టీజి -12- యు -3751), అశోక్ లేలాండ్ వాహనం (టీఎస్ -12-టీ -3265), ముగ్గురు డ్రైవర్లు ఆడే రామ్ దాస్ (42), మీర్ ఫుర్కాన్ అలీ ఖాన్(32), జస్వంత్ రే(35) పట్టుకొని, స్వాధీనం చేసుకొని అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రధాన నిర్వాహకుడు అఖిల్ అలియాస్ బబ్లూ పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.






