ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణంలో రికార్డు.. రూ.1429 కోట్లు ఆదా

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-17 02:02:03  IST  )

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకానికి మ హిళల నుంచి అనూహ్య స్పందన వస్తోంది.

ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణంలో రికార్డు.. రూ.1429 కోట్లు ఆదా
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకానికి మ హిళల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఈ పథకం ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయి లో 33 కోట్లకు పైగా మహిళలు టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. జీరో టికెట్‌ రూపేణా మహిళలకు రూ. 1,429 కోట్ల వరకు ఆదా అయ్యింది.

రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా..

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల అమల్లో భాగంగా అధికారంలో కి వచ్చిన 48 గంటల్లోనే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ పథకం ద్వారా మహిళలు, బాలికలు, ట్రాన్స్​‍జెండర్లు ఆధార్‌ కార్డు చూపించి ఎక్స్​​‍ప్రెస్, ఆర్డినరీ, పల్లె వెలుగు, సిటీ మెట్రో బస్సుల్లో ఉచితంగానే ప్రయాణించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దీం తో మహిళలు అధిక సంఖ్యలో ఉచి త బస్సు సౌకర్యాన్ని వినియోగించు కుంటున్నారు. గృహిణులు సహా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ రం గాల్లో పనిచేసే చిరుద్యోగులు, ఐటీ కారిడార్‌లో పనిచేసే ఉద్యోగులతో పాటు వివిధ కేటగిరీలకు చెందిన మహిళలు ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 33 కోట్ల 9 లక్షల మంది మహిళలు ప్రయాణం చేశారు. దీనివల్ల జీరో టికెట్‌ ఛార్జీలను ప్రభుత్వమే చెల్లిస్తుండడంతో మహిళలతో పాటు ఆర్టీసీకి సైతం భారీగానే ఆ దాయం సమకూరింది. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో నిత్యం సగటున 5 లక్షల మంది మహిళలు ఉచిత బస్సుల్లో ప్రయాణించారు. ఈ క్రమంలో మహిళలకు ఇప్పటి వరకు రూ. 627 కోట్ల లబ్ధి కలిగింది. వికారాబాద్‌ జిల్లాలో 4 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

ఆక్యుపెన్సీ అదరహో..

ఈ మూడు జిల్లాల పరిధిలో సుమారు 2 వేలకు పైగా బస్సులు ప్రతి రోజు 7 లక్షలకు పైగా కిలోమీటర్లు తిరుగుతున్నాయి. మహాలక్ష్మి పథకం అమలులోకి రాకముందు సిటీ బస్సుల్లో ఆక్యుపెన్సీ 65 నుంచి 70 శాతం వరకు ఉంటే ఇప్పుడు ఏకంగా వంద శాతానికి పైగా పెరిగింది. ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ముఖ్యంగా పేద, మధ్య త రగతి మహిళలకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతోంది. వస్త్ర దుకాణాలు, షాపింగ్‌ మాల్స్, సూపర్‌ మార్కెట్లు, మెడికల్‌ షాపులు, ఇతర వృత్తి పనులు చేసుకునే వారికి ఈ పథకం భరోసా కల్పించింది. వీరంతా ప్రతి నెలా నాలుగు వేల వరకు ఛార్జీల రూపంలో వెచ్చించాల్సి వస్తోంది. ఇంటి కిరాయిలు, కూరగాయల ధరలు, నిత్యావసర ధరలు పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో ఆర్టీసీ చార్జీల భారం తగ్గడం ఆయా వర్గాలకు భారీ ఊరటనే కల్పిస్తోంది. ఛార్జీల రూపంలో ఆదా అయిన డబ్బులను ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నామని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Next Story