Ramadan: రంజాన్ వేడుకలు.. ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి సందేశం ఇదే

by Ramesh Naini |   (  Updated:2025-03-31 05:32:50  IST  )

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పవిత్ర రంజాన్ (Ramadan) పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు.

Ramadan: రంజాన్ వేడుకలు.. ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి సందేశం ఇదే
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పవిత్ర రంజాన్ (Ramadan) పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేక ప్రార్థనల్లో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ (Eid Mubarak) శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంజాన్ సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. ప్రేమ, సోదరభావం, శాంతికి చిహ్నమే రంజాన్ అని ఈ సందర్భంగా పలువురు ముస్లిం మత పెద్దలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, ప్రముఖులు రంజాన్ విషెస్ తెలియాజేశారు.

ప్రధాని మోడీ (PM Modi) తాజాగా ఎక్స్ వేదిక శుభాకాంక్షలు తెలిపారు. ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు. ఈ పండుగ మన సమాజంలో ఆశ, సామరస్యం, కరుణ స్ఫూర్తిని పెంపొందించి, విజయం కలగాలని ఆకాంక్షించారు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ముస్లిం సోదర, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేమ, కరుణ, ఐకమత్యం సందేశాలతో సేవాతత్పరత, ఆధ్యాత్మికత వెల్లివిరిసే ఈద్ ఉల్ ఫితర్ పర్వదినం సందర్భంగా అల్లా కరుణా కటాక్షాలు అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ మంత్రి నారా లోకేష్, టీజీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం, తెలంగాణ, ఏపీ రాజకీయ నేతలు, ప్రముఖులు, సెలబ్రిటీలు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

Next Story