- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్, కాంగ్రెస్ పై విరక్తిపుట్టి మా పార్టీలోకి వస్తున్నారు: తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు
తెలంగాణలో బీజేపీ ప్రభావం పెరుగుతోందని బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. రాష్ట్రంలో ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో బీజేపీ ప్రభావం పెరుగుతోందని బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. రాష్ట్రంలో ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. ఇతర పార్టీల్లో వాళ్ల నాయకత్వం మీద నమ్మకం లేక బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. గత ప్రభుత్వం లోని బీఆర్ఎస్ పార్టీ నుండే కాకుండా ఇతర పార్టీల నుండి కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీజేపీ ఎవ్వరినీ ఆశలు చూపించి పార్టీలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఉన్నవి కేవలం లోకల్ బాడీ ఎన్నికలే అని బీఆర్ఎస్, కాంగ్రెస్ పై విరక్తి పుట్టే తమ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. బీసీ ధర్నా పేరుతో ఢిల్లీలో కాంగ్రెస్ నాటకం ఆడుతోందని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. 42శాతం రిజర్వేషన్లలో ముస్లీంలకు 10 శాతం ఇస్తామని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారా అని ప్రశ్నించారు. 42 శాతం రిజర్వేషన్లు కేవలం బీసీలకే కేటాయించాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. బీజేపీలో ఏ పార్టీని విలీనం చేసుకోమని, ఏ పార్టీని విలీనం చేసుకోమని అన్నారు.






