అంకితభావంతో పనిచేస్తా: తెలంగాణ బీజేపీ కేడర్‌కు రాంచందర్ రావు హామీ

by Gantepaka Srikanth |   (  Updated:2025-07-01 16:13:36  IST  )

తెలంగాణ బీజేపీ(Telangana BJP) అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన రాంచందర్ రావు(Ramchander Rao) పార్టీ కేడర్‌కు కీలక హామీ ఇచ్చారు.

అంకితభావంతో పనిచేస్తా: తెలంగాణ బీజేపీ కేడర్‌కు రాంచందర్ రావు హామీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ(Telangana BJP) అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన రాంచందర్ రావు(Ramchander Rao) పార్టీ కేడర్‌కు కీలక హామీ ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘మనస్పూర్తిగా, పూర్తి బాధ్యతతో అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన ఈ మహోత్తర సందర్భాన్ని నేను గౌరవంగా స్వీకరిస్తున్నాను. ఈ ఉద్యమ ప్రయాణంలో నా పక్కన నిలబడి, స్థిరమైన నమ్మకం, పార్టీ పట్ల ఉన్న అంకితభావం, మరియు కలకాలం నిలిచే మద్దతు అందించిన ప్రతి కార్యకర్తలకి , అగ్రనేతలకు మరియు అభిమానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రధానమంత్రి మోడీ, జాతీయ అధ్యక్షుడు నడ్డా మార్గదర్శకత్వంలో, వ్యూహాత్మక దృష్టితో, మరియు దృఢ సంకల్పంతో పనిచేస్తూ “వికసిత తెలంగాణ” లక్ష్యాన్ని సాధించడానికి అంకితభావంతో పనిచేస్తానని నేను హృదయపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను’ అని పేర్కొన్నారు.

కాగా, తెలంగాణ రాజకీయాల పట్ల బీజేపీ గత కొంత కాలంగా ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో దూకుడుగా వ్యవహరించే నేతల కంటే.. వివాద రహితుడు, అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం ఉన్న రాంచందర్ రావును ఎంపిక చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story