- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చివరి నిమిషంలో బీజేపీ అధిష్టానం ట్విస్ట్.. నూతన అధ్యక్షుడి ఖరారుపై సోషల్ మీడియాలో విమర్శలు
బీజేపీ అధిష్టానం నిర్ణయంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో : తెలంగాణ బీజేపీ (Telangana BJP) అధ్యక్షుడు ఎవరు?.. అనే ఉత్కంఠకు అధిష్టానం తెరదించింది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు (Ramchander Rao) పేరును ఖరారు చేసింది. దీంతో ఆయన ఒక్కరే ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు నామినేషన్ దాఖలు కోసం ముఖ్యనేతలకు ఉదయం అధిష్ఠానం నుంచి సమాచారం వచ్చింది. అయితే అధ్యక్ష పదవి రేస్‌లో ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్, బండి సంజయ్, రామచందర్‌రావు, డా.లక్ష్మణ్, వంటి నేతల పేర్లు ప్రధానంగా వినిపించాయి. ఈటలకు ఈ పోస్టు పక్కా అనే టాక్ సొంత పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపించింది. కానీ పార్టీలో సీనియర్, ఆర్ఎస్ఎస్ అండదండలు ఉన్న రామచందర్‌రావువైపు అధిష్టానం మొగ్గు చూపింది. బీజేపీ హైకమాండ్ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.
సోషల్ మీడియాలో విమర్శలు..
ఈటల రాజేందర్ పేరు ఖరారు అయినట్లు ప్రచారం జరిగినా ఆయన కాకపోతే మిగతా ఎంపీలలో ఎవరికైనా అవకాశం ఇస్తారనే చర్చ జరిగింది. కానీ అనూహ్యంగా రామచందర్‌రావు పేరు తెరపైకి వచ్చింది. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో (Social Media) పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అధిష్టానం చివరి నిమిషంలో తన నిర్ణయం మార్చుకోవడం వెనుక పార్టీకి చెందిన ముఖ్యనేతల ఒత్తిడి ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్న నేతలలో ఎవరినో ఒకరిని ఎంపిక చేయకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పార్టీ తన కాడిని దించేయడమే అనే నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
రాజాసింగ్ అసంతృప్తి..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్‌రావు పేరు ఖరారు అయిందంటూ ప్రచారం జరుగుతున్న వేళ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని అధిష్టానం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోందని, అయితే అధ్యక్షుడిని బూత్ కార్యకర్త నుంచి ముఖ్య నేత వరకు ఓటేసి ఎన్నుకోవాలని ఆయన అన్నారు. ‘నావాడు, నీవాడు’ అంటూ నియమించుకుంటూ పోతే పార్టీకి తీవ్ర నష్టమని పేర్కొన్నారు.
బీజేపీ- బీఆర్ఎస్ పొత్తుకు తొలి అడుగు..
రామచందర్‌రావు పేరు ఖరారు నేపథ్యంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిచండం అంటే బీజేపీ- బీఆర్ఎస్ పొత్తుకు తొలి అడుగు అని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు బీజేపీ, కేంద్రంలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు.. ఇదే ఒప్పంద సారాంశం అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి చేయబోతున్నాయని చెప్పారు.






