మైక్రో ఫైనాన్స్ స్కామ్‌లో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్

by Gantepaka Srikanth |

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మైక్రో ఫైనాన్స్ మోసం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

మైక్రో ఫైనాన్స్ స్కామ్‌లో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మైక్రో ఫైనాన్స్ మోసం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రమావత్ మధును సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా పరారీలో ఉన్న మధును సాంకేతిక ఆధారాలతో పట్టుకున్న పోలీసులు, అతనిపై ఇప్పటికే నమోదైన పలు కేసుల ఆధారంగా విచారణను వేగవంతం చేశారు. అరెస్టుకు ముందు మధు ఒక వీడియోను విడుదల చేసి, ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు రహస్యాలను బయటపెట్టడం గమనార్హం. ఈ కేసులో తాను అప్రూవర్‌గా మారుతున్నట్లు ప్రకటించిన మధు, పలువురు ప్రముఖుల పేర్లను ప్రస్తావించారు. ఈ కేసులో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ గాయని మంగ్లీకి (సత్యవతి రాథోడ్) మధు క్లీన్ చిట్ ఇచ్చారు. "ఈ మైక్రో ఫైనాన్స్ వ్యవహారంతో సింగర్ మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదు. ఆమెను అనవసరంగా ఈ వివాదంలోకి లాగారు" అని మధు ఆ వీడియోలో స్పష్టం చేశారు. ఆమె పేరు వాడుకుని కొందరు లబ్ధి పొందే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. కుంభకోణం వెనుక అసలు వ్యక్తులు హిమాకాంత్ రెడ్డి అని కుండబద్దలు కొట్టారు. హిమాకాంత్ రెడ్డి ఏకంగా రూ. 20 కోట్లు తీసుకున్నాడని మధు వెల్లడించారు. అడ్వకేట్ సుబ్బారావు, హిమాకాంత్ రెడ్డి మంచి స్నేహితులని.. హిమాకాంత్ నుంచి డబ్బులు ఇప్పిస్తానని సుబ్బారావు తనకు భరోసా ఇచ్చారని మధు ఆ వీడియోలో పేర్కొన్నారు.

Next Story