- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పహల్గామ్ ఉగ్రదాడిపై రామరాజ్యం వీరరాఘవరెడ్డి సంచలన వ్యాఖ్యలు
పహల్గామ్ ఉగ్రదాడిపై రామరాజ్యం వీరరాఘవరెడ్డి షాకింగ్ కామెంట్లు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడిపై రామరాజ్యం వీరరాఘవరెడ్డి షాకింగ్ కామెంట్లు చేశారు. పహల్గామ్ దాడిలో 27మందిని మీరు హిందువులా కాదా అని ప్యాంటులు విప్పి చంపేశారని అన్నారు. ఇలాంటి దాడులు చేసేలా వారి ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారని చెప్పారు. 2040 కల్లా భారత దేశాన్ని ఎలా స్వాధీనం చేసుకోవాలి అనేదాని కోసం వాళ్లు ప్రణాళిక వేసుకుని పనిచేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి దాడులు ఎదుర్కొనేందుకు ప్రతి ఊరిలో ఆలయ అర్చకులు ఓ క్షత్రియుడిని ఎంచుకుని సైనికుడిగా తయారు చేసుకోవాలని చెప్పారు. 27వేల మంది సైన్యాన్ని సిద్ధం చేసుకుంటే మన ఆలయాలు, ఆలయ భూములు కాపాడుకోవచ్చని అన్నారు.
ఆ ఉద్దేశ్యంతోనే అనేక దేవాలయాలకు వెళుతూ అర్చకులను కలిసి వారికి ఈ విషయాలు చెబుతున్నామని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే వీరరాఘవరెడ్డి రామరాజ్యం పేరతో చిలుకూరి బాలజీ ఆలయ అర్చకులు రంగరాజన్ పై దాడి చేసిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు వీరరాఘవరెడ్డి ఎవరికీ పరిచయం లేదు కానీ ఈ ఘటనతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. డబ్బులు ఇవ్వాలంటూ తన ప్రైవేటు సైన్యంతో వచ్చి వీరరాఘవరెడ్డి రంగరాజన్ పై దాడి చేయడం సంచలనంగా మారడంతో సీఎం సైతం స్పదించారు. వెంటనే వీరరాఘవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటి లాంటివాళ్లు సమాజానికే ప్రమాదకరం అని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు మళ్లీ ఆయన హాట్ కామెంట్లు చేయడంతో ఇలాంటి వారిని ఎందుకు బయటకు వదిలారని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.






