రామాంతపూర్ ఘటన.. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన సర్కార్

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-18 09:50:08  IST  )

రామాంతపూర్ (Ramanthapur) పరిధిలోని గోఖులే నగర్‌ శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఆదివారం అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

రామాంతపూర్ ఘటన.. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన సర్కార్
X

దిశ, వెబ్‌డెస్క్: రామాంతపూర్ (Ramanthapur) పరిధిలోని గోఖులే నగర్‌ శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఆదివారం అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రథాన్ని లాగుతుండగా కరెంట్ షాక్ తగిలి ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం ఆరుకు చేరింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. రామాంతపూర్ ప్రమాద మృతులకు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా (Exgratia) ప్రకటించింది. అందుకు సంబంధించి త్వరలోనే చెక్‌లను పంపిణీ చేస్తామని, గాయపడిన వారికి వైద్య ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఇవాళ ఆయన గాయపడిన వారిని పరామర్శించేందుకు గాంధీ ఆసుపత్రికి వెళ్లారు.

Next Story