తెలంగాణ కొత్త CSగా రామకృష్ణారావు

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-27 13:09:52  IST  )

తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి రామృష్ణారావు(Ramakrishna Rao) నియమితులయ్యారు.

తెలంగాణ కొత్త CSగా రామకృష్ణారావు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి రామృష్ణారావు(Ramakrishna Rao) నియమితులయ్యారు. ఈ నెలాఖరున శాంతి కుమారి(Santhi Kumari) రిటైర్ అవుతుండటంతో రామృష్ణారావుకు ప్రభుత్వం తాజాగా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, 1991 ఐఏఎస్‌కు బ్యాచ్​చెందిన రామకృష్ణారావు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఆర్థికశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయన వచ్చే ఆగస్టులో రిటైర్డ్ కానున్నారు. ప్రస్తుతం ఉన్న ఐఏఎస్‌లలో సీనియర్‌గా ఉన్నారు. ఆర్థికశాఖలో ఈయన చేసిన సేవలు, ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో అనుభవం తోడ్పడుతున్నదనే ఉద్దేశంతో సీఎస్‌గా నియమించినట్లు తెలుస్తోంది. రామకృష్ణారావు గతంలో నల్లగొండ జాయింట్​కలెక్టర్‌గా, గుంటూరు కలెక్టర్‌గా పని చేశారు.

ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న శాంతికుమారి 1989 ఐఏఎస్​బ్యాచ్‌కు చెందిన అధికారి. 2023 జనవరి 11 నుంచి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. రిటైర్మెంట్ అనంతరం శాంతి కుమారిని చీఫ్​ఇన్ఫర్మేషన్​కమిషనర్‌గా నియమించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె నియామకం ఇప్పటికే ఖరారైందని, అధికారిక ప్రక్రియ మాత్రమే జరగాల్సి ఉందని తెలిసింది.




Next Story