మోడీ దూర దృష్టితో భారత్​ అన్ని రంగాల్లో అభివృద్ది : బీజేపీ చీఫ్​రాంచందర్ రావు

by Ajay Maddhiboyina |

ప్రధాని మోడీ 2025 సంవత్సరంలో దృఢమైన, దూరదృష్టి గల నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్​రావు పేర్కొన్నారు.

మోడీ దూర దృష్టితో భారత్​ అన్ని రంగాల్లో అభివృద్ది : బీజేపీ చీఫ్​రాంచందర్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రధాని మోడీ 2025 సంవత్సరంలో దృఢమైన, దూరదృష్టి గల నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్​రావు పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో, వారి అడుగుజాడల్లో నడుస్తూ 2026లో భారతదేశాన్ని “వికసిత్ భారత్”గా తీర్చిదిద్దే దిశగా ప్రతి ఒక్కరూ భాగస్వాములై కృషి చేయాలని పిలుపునిచ్చారు. గురువారం భారతదేశ, తెలంగాణ ప్రజలకు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత్ ప్రస్తుతం 4.18 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో జపాన్‌ను అధిగమించి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. త్వరలోనే ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకునే దిశగా దేశం వేగంగా ముందుకెళ్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నూతన సంవత్సరంలో మనందరం “నేషన్ ఫస్ట్” అనే భావనతో దేశానికి మన జీవితాన్ని అంకితం చేస్తూ, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి చూపిన మార్గంలో నడుచుకుంటూ, మోడీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యం సాధన దిశగా ముందడుగు వేయాలని ఆకాంక్షించారు.

Next Story