- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అది బీసీల రిజర్వేషన్ల బిల్లు కాదు.. ముస్లిం రిజర్వేషన్ల బిల్లు : రామచందర్ రావు
బీసీ రిజర్వేషన్(BC Reservations) బిల్లుపై తెలంగాణ బీజేపీ(BJP) అధ్యక్షుడు రామచందర్ రావు(Ramachandar Rao) తీవ్ర ఆరోపణలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : బీసీ రిజర్వేషన్(BC Reservations) బిల్లుపై తెలంగాణ బీజేపీ(BJP) అధ్యక్షుడు రామచందర్ రావు(Ramachandar Rao) తీవ్ర ఆరోపణలు చేశారు. నేడు హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన... కాంగ్రెస్(Congress) తీసుకొచ్చింది బీసీల రిజర్వేషన్ల బిల్లు కాదని, అది కేవలం ముస్లిం రిజర్వేషన్ల బిల్లని ఆరోపించారు. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని తెలిపిన రామచందర్ రావు.. కానీ బీసీ రిజర్వేషన్ల పేరిట మతపరమైన కోటా కల్పించడం అన్యాయం అని పేర్కొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు చేసే పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేని స్పష్టం చేసారు. బీసీ రిజర్వేషన్ల బిల్లులో న్యాయపరమైన లోపాలను దాచిపెట్టి, కేంద్రాన్ని ప్రజలు నిందించేలా కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
కామారెడ్డిలో బీసీలకు డిక్లరేషన్(Kamareddy BC Decleration) హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వాటిని అమలు చేయకుండా తప్పించుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానిదేని తేల్చి చెప్పారు. అందులో ఒక్క శాతం తగ్గినా బీజేపీ ఊరుకోదని హెచ్చరిస్తూ... బీసీల హక్కులు సాధించే దాకా బీజేపీ పోరాటం ఆగదని రామచందర్ రావు వెల్లడించారు.






