పెద్ది మూవీ సీన్ రిపీట్ చేసిన‌ కేటీఆర్‌..!

by velandi.Saikiran |

పెద్ది మూవీలో రామ్ చరణ్ తరహాలో కూడా సీన్ క్రియేట్ చేశారు కేటీఆర్.

పెద్ది మూవీ సీన్ రిపీట్ చేసిన‌ కేటీఆర్‌..!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తన సొంత నియోజకవర్గ సిరిసిల్లలో పర్యటించారు. కొత్త సంవత్సరం సందర్భంగా సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్ పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలో కేటీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ లో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూనియర్ కళాశాల మైదానంలో క్రీడాకారులతో క్రికెట్ కాసేపు ఆడి, విజేతలకు బహుమతులు అందజేశారు. అయితే క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో భారీ షాట్లు కొట్టారు కేటీఆర్. అలాగే పెద్ది మూవీలో రామ్ చరణ్ తరహాలో కూడా సీన్ క్రియేట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. రామ్ చరణ్ ను ఎవరైనా ఫాలో కావాల్సిందేనని అంటున్నారు.

Next Story