TS: ప్రగతిభవన్‌లో రక్షాబంధన్ వేడుకలు

by Disha Web Desk 2 |
TS: ప్రగతిభవన్‌లో రక్షాబంధన్ వేడుకలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రక్షాబంధన్ వేడుకలు ప్రగతిభవన్‌లో ఘనంగా జరిగాయి. తోబుట్టువుల ప్రేమానురాగాలు, అనుబంధాలకు ముఖ్యమంత్రి నివాసమైన ప్రగతి భవన్ వేదికగా నిలిచింది. రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుకు ఆయన అక్కలు, చెల్లెలు రాఖీలు కట్టి రాఖీ పండుగ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, లలితమ్మ, చెల్లెలు వినోదమ్మ తమ సోదరునికి రాఖీ కట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారికి పాదాభివందనాలు చేసి ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభమ్మ, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed