- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తెలంగాణలో రెండుస్థానాలకు ఎన్నికలు
తెలంగాణలో రెండుస్థానాలకు రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. దేశవ్యాప్తంగా 37 మంది రాజ్యసభ ఎంపీల పదవీకాలం పూర్తికానుండగా.. ఆయా స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ రానుంది. మార్చి 5వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ, 6న స్క్రూటినీ, మార్చి 9వ తేదీ వరకూ నామినేషన్ల విత్ డ్రా జరగనున్నాయి. మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకూ పోలింగ్ జరగనుండగా, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మార్చి 20వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా రాజ్యసభ్య ఎన్నికలు ముగియనున్నాయి. ఏప్రిల్ 9వ తేదీతో తెలంగాణ ఎంపీలైన కేఆర్ సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీ పదవీకాలం పూర్తి కానున్నాయి. ఆ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. కేఆర్ సురేష్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి, అభిషేక్ మను సింఘ్వీ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మొత్తం 37 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో ఏడు మహారాష్ట్ర, ఒడిశాలో మూడు, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో ఆరేసి స్థానాలు, అస్సాంలో మూడు, బిహార్ లో నాలుగు, ఛత్తీస్ గఢ్ లో రెండు, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లలో ఒక్కొక్క స్థానానికి, తెలంగాణలో రెండుస్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.






