- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో రాజ్యసభ ఏకగ్రీవం!.. జాక్ పాట్ కొట్టిన కాంగ్రెస్
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కాంగ్రెస్ అభ్యర్థులు సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి విజయం లాంఛనమే.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. ఈ స్థానాల ఎన్నిక కోసం నామినేషన్ల ప్రక్రియ కొద్ది సేపటి క్రితం ముంగిసింది. మొత్తం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ తరఫున అభిషేక్ సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా స్వతంత్ర అభ్యర్థిగా సాయి అనే వ్యక్తి నామినేషన్ వేశారు. అభిషేక్ సింఘ్వీ మూడుసెట్లు, వేం నరేందర్‌రెడ్డి నాలుగు సెట్లు, సాయి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే స్వతంత్ర అభ్యర్థి 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకుండా నామినేషన్ వేయడంతో స్క్రూటినీలో అది తిరస్కరణకు గురి కానుంది. దీంతో సింఘ్వీ, వేం నరేందర్ ఏకగ్రీవం లాంఛనం కానుంది.
రేపు స్క్రూటీని:
దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని మొత్తం 37 రాజ్యసభ స్థానాల భర్తీ కోసం నామినేషన్ల ఫిబ్రవరి 26న మొదలయ్యాయి. దాఖలైన నామినేషన్లు మార్చి 6న అధికారులు పరిశీలిస్తారు. పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులకు మార్చి 9 వరకు అవకాశం ఉంది. ఏకగ్రీవం కాని పక్షంలో అవసరమైతే మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లు లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.
బీఆర్ఎస్ దూరం:
పదేళ్లు తెలంగాణలో ఏకచత్రాధిపత్యం కొనసాగించిన బీఆర్ఎస్ కు క్రమంగా ఎదురుగాలి వీస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో రాజ్యసభ పోటీకి బీఆర్ఎస్ దూరంగా ఉంది. ఖాళీ అయిన రెండు స్థానాల్లో సురేశ్ రెడ్డి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కాగా తాజాగా ఇప్పుడు ఆ స్థానాన్ని గులాబీ పార్టీ కోల్పోనుంది. ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తే కనీసం 40 ఓట్లు సాధించే అభ్యర్థులు రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధిస్తారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. సంఖ్యా బలం లేకపోవడంతో బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంది.






