- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు తెలంగాణకు రాజ్‌నాథ్ సింగ్
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Defence Minister Rajnath Singh) రేపు తెలంగాణకు రానున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Defence Minister Rajnath Singh) రేపు తెలంగాణకు రానున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగే స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో(Alluri SitaramaRaju Birth Anniversory) పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. అల్లూరి సీతారామరాజు, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో గిరిజన సమాజ హక్కులు మరియు సంక్షేమం కోసం బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరోచిత చరిత్రకు గుర్తుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
రాజ్‌నాథ్ సింగ్ తన ఎక్స్ పోస్ట్‌లో సీతారామరాజు జయంతిని పురస్కరించుకొని అల్లూరి ధైర్యసాహసాలను కొనియాడారు. ఆయన గిరిజన సంఘాల సంక్షేమం కోసం చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య నేతలతోపాటు, పలువురు జాతీయ నాయకులు కూడా పాల్గొననున్నారు.






