- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: 190 ఫ్లాట్లు.. రూ.36 కోట్ల ప్రాఫిట్
by Gantepaka Srikanth |
ఘట్ కేసర్ పోచారంలోని రాజీవ్ స్వగృహ అపార్ట్‌మెంట్లను శుక్రవారం లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు కేటాయించారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఘట్ కేసర్ పోచారంలోని రాజీవ్ స్వగృహ అపార్ట్‌మెంట్లను శుక్రవారం లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు కేటాయించారు. రెండు రోజులపాటు నిర్వహించనున్న ఈ ప్రక్రియలో తొలిరోజు 190 ఫ్లాట్లను కేటాయించగా.. ప్రభుత్వానికి రూ.36 కోట్ల ఆదాయం చేకూరింది. రాజీవ్ స్వగృహ చీఫ్ ఇంజినీర్ భాస్కర్‌రెడ్డి, జీఎం నరేందర్‌రెడ్డి, ఘట్‌కేసర్ తహసీల్దార్ రజని సమక్షంలో 190 మంది దరఖాస్తుదారులకు ఫ్లాట్లను కేటాయించారు. మిగిలిన వాటికి శనివారం లాటరీ నిర్వహించనున్నారు. శనివారం సింగిల్ బెడ్ రూం ఫ్లాట్ల కేటాయింపునకు లాటరీ నిర్వహణ ఉంటుందని స్వగృహ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం తెలిపారు. ముందు ప్రకటించినట్లుగా శనివారం సైతం దరఖాస్తులను స్వీకరిస్తామని, వారికీ లాటరీ ద్వారా కేటాయింపు ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు.
Next Story






