- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rajasingh: డైరెక్టర్ రాజమౌళిని జైల్లో వేయాలి: రాజాసింగ్
దేవుళ్లపై నమ్మకం లేనప్పుడు దేవుళ్ల పేరుతొ సినిమాలు తీసి రూ.కోట్లు ఎందుకు సంపాదిస్తున్నారని రాజమౌళిని రాజాసింగ్ ప్రశ్నించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: గ్లోబ్ ట్రూటర్ ఈవెంట్‍లో హనుమంతుడిపై దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటుగా స్పందించారు. రాజమౌళి లాంటి వాళ్లను జైల్లో వేయాలని డిమాండ్ చేశారు. హిందువులంతా రాజమౌళి సినిమాలను బహిష్కరించాలని దేవుళ్లపై నమ్మకం లేనప్పుడు దేవుళ్ల పేరుతో సినిమాలు తీసి రూ.కోట్లు ఎందుకు సంపాదిస్తున్నారని నిలదీశారు. ఈ మేరకు రాజాసింగ్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. వారణాసి సినిమాకు ప్రచారం జరగాలని ఇలా మాట్లాడారా లేక నిజంగానే మీరు నాస్తికులా రాజమౌళి క్లారిటీ ఇవ్వాలన్నారు.
హిందూ ధర్మం, దేవుళ్లపై అభిమానం లేని రాజమౌళి సినిమాలు హిందువులు ఎందుకు చూడాలని ప్రశ్నించారు. ప్రభాస్‍తో బాహుబలి సినిమా తీసి దాంట్లో శివలింగం ఎత్తించి కోట్లాది రూపాయలు సంపాదించుకుని ఇప్పుడు హిందూ దేవుళ్లపై నమ్మకం లేదని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజమౌళి హిందూ దేవుళ్లపై మాట్లాడటం ఇది మొదటి సారి కాదని గతంలో కృష్ణుడు, రాముడిపై మాట్లాడారని అన్నారు. ఇప్పుడు హనుమంతుడిపై మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. ఇలాంటి డైరెక్టర్‍పై ఫిర్యాదులు చేయాలని రాజాసింగ్ హిందువులకు పిలుపునిచ్చారు.






