Rajasingh: దొంగలంతా ఒక్కటై నాపై వార్.. సొంత పార్టీపై మరోసారి రాజాసింగ్ హాట్ కామెంట్స్

by Prasad Jukanti |

బీజేపీపై రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.

Rajasingh: దొంగలంతా ఒక్కటై నాపై వార్.. సొంత పార్టీపై మరోసారి రాజాసింగ్ హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ బీజేపీలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. పెద్ద ప్యాకేజీ వస్తే బీజేపీ (Telangana BJP) నేతలు బీఆర్ఎస్ తో కలిసిపోతారని, ప్రతి ఎన్నికల్లోనూ మా నేతలు బీఆర్ఎస్ తో కుమ్మక్కయ్యారని ఆయన నిన్న చేసిన వ్యాఖ్యల కాంట్రవర్సీగా మారాయి. రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ, ప్రత్యర్థులలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇంతలో ఆయన మరోసారి సొంత పార్టీపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తనపై యుద్ధం మొదలైందని దొంగలంతా ఒక్కటయ్యారని ధ్వజమెత్తారు. కరీంనగర్ నుంచే తనపై వార్ స్టార్ట్ అయిందన్నారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం ప్రతిపాదన వచ్చిందంటూ కవిత (Kavitha) చేసిన వ్యాఖ్యలను సమర్ధించినందుకే తనపై సోషల్ మీడియాలో వార్ నడుస్తోందని రాజాసింగ్ ఇవాళ తాజాగా మరో ప్రెస్ నోట్ విడుదల చేశారు.

Next Story