- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rajaiah: ఎస్సీ వర్గీకరణపై సీఎంది రెండు నాలుకల ధోరణి.. తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు
ఎస్సీ వర్గీకరణ (Classification of SC)పై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రెండు నాలుకల ధోరణిని అవలంభిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య (Former Deputy CM Thatikonda Rajaiah) ఆరోపించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎస్సీ వర్గీకరణ (Classification of SC)పై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రెండు నాలుకల ధోరణిని అవలంభిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య (Former Deputy CM Thatikonda Rajaiah) ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి అయ్యాకే రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటీఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మాదిగ బిడ్డలు ఉద్యోగాల విషయంలో తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని అన్నారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రెండు నాలుకల ధోరణిని మానుకోవాలని హితవు పలికారు. ఆయన బయటకు మాదిగలకు అనుకూలంగా ఉన్నట్లు నటిస్తున్నా.. లోలోపల మాలలను ఆందోళనలకు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మాదిగ యువతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే ఉగ్యోగాల ఫలితాల ప్రకటనను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.
కాగా, ఈనెల 6న సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన కేబినెట్ భేటీ (Cabinet Meeting)లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యంగా ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లు (SC Caste Classification Draft Bill)కు మంత్రివర్గం ముక్తకంఠంతో ఆమోదం తెలిపింది. న్యాయపరమైన చిక్కులు లేకుండా తుది మెరుగులు దిద్దాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బడ్జెట్ సమావేశాల్లో (Budget Sessions) బిల్లును ప్రవేశపెట్టాల్సిన సుధీర్ఘంగా చర్చించి ఆమోదించనున్నారు.






