- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని వెంటనే మార్చండి: రాజాసింగ్ సంచలన డిమాండ్
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election)ల ఫలితాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election)ల ఫలితాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) స్పందించారు. శుక్రవారం ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలంతా ఏకతాటిపైకి వచ్చి జూబ్లీహిల్స్‌లో ఆ పార్టీ అభ్యర్థి కోసం తీవ్రంగా కృషి చేశారు. కానీ.. బీజేపీ నేతలు మాత్రం.. పార్టీ అభ్యర్థిని ఎలా ఓడించాలనే దానిపై పనిచేశారని తీవ్ర విమర్శలు చేశారు. కనీసం డిపాజిట్ కూడా రాలేదని.. దీనిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ లక్ష్యంగా రాజాసింగ్ విమర్శలు చేశారు.
కాంగ్రెస్ నేతలను చూసి బీజేపీ నేతలు చాలా నేర్చుకోవాలని హితవు పలికారు. బీజేపీ రాష్ట్ర నేతలు ఇలాగే వ్యవహరిస్తే రాబోయే జీహెచ్ఎంసీ, లోకల్ బాడీ ఎన్నికల్లోనూ భంగపాటు తప్పదని కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు జూబ్లీహిల్స్ ఓటమికి బాధ్యులు ఎవరని అడిగారు. బీజేపీని కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. వీరి వల్ల రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాకపోగా.. పార్టీ కోసం పనిచేసే వారిని కూడా ఎదగనీయరు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరినీ టార్గెట్ చేయడం లేదని.. పార్టీ పరిస్థితి చూస్తుంటే బాధేస్తోందని ఆవేదన చెందారు.






