యూటర్న్ తీసుకున్న రాజాసింగ్..? గోషామహల్ ఉప ఎన్నికపై ఎమ్మెల్యే సంచలన కామెంట్స్

by Ramesh Naini |   (  Updated:2025-07-20 11:31:18  IST  )

బీజేపీకి ఇటీవల రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తుంది.

యూటర్న్ తీసుకున్న రాజాసింగ్..? గోషామహల్ ఉప ఎన్నికపై ఎమ్మెల్యే సంచలన కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీకి ఇటీవల రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. హైకమాండ్ ఆదేశిస్తేనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వ్యాఖ్యానించారు. ఆదివారం లాల్ దర్వాజ (Bonalu Festival) బోనాల ఉత్సవాల్లో రాజాసింగ్ పాల్గొన్నారు. సింహవాహిని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా గోషామహాల్ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు.

నేను పక్కా హిందూ నేతను...

కమలం పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్, శివసేన వంటి పార్టీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఏ పార్టీలోకి వెళ్లే ఆలోచన లేదని కుండబద్దలు కొట్టారు. ఎంఐఎంతో దోస్తీ ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరబోనని క్లారిటీ ఇచ్చారు. నేను పక్కా హిందూ నేతను.. భారతదేశానికి సేవ చేస్తున్న నరేంద్ర మోడీ, అమిత్ షా లకు ప్రచారకుడిగా పనిచేస్తానని స్పష్టం చేశారు.

అధిష్టానం చెబితేనే రిజైన్...

పువ్వు గుర్తుపై గెలిచిన తాను అధిష్టానం ఆదేశిస్తేనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తేల్చి చెప్పారు. ఉప ఎన్నిక వస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, గోషామహాల్ లో బై పోల్ వస్తే పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుందో తెలియదన్నారు. (BJP) బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాని అన్నారు. తన చివరి శ్వాస వరకు హిందుత్వం కోసం పోరాటం చేస్తానని అన్నారు. బీజేపీ అధిష్టానంపై ఎలాంటి వ్యతిరేక భావం లేదని అన్నారు.

Next Story