- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టైమ్‌పాస్ మీటింగ్‌లు వద్దు.. బీజేపీ హైకమాండ్‌కు రాజాసింగ్ సంచలన విజ్ఞప్తి
బీజేపీ అధిష్టానానికి(BJP High Command) ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) కీలక విజ్ఞప్తి చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ అధిష్టానానికి(BJP High Command) ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) కీలక విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని త్వరగా నియమిచాలని రిక్వెస్ట్ చేశారు. టైమ్ పాస్ మీటింగ్‌లో చాలా అలిసిపోయినట్లు కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు మరో టైమ్ పాస్ మీటింగ్ పెట్టారని తీవ్ర విమర్శలు చేశారు.
కాగా, బీజేపీ తెలంగాణ(BJP Telangana) స్టేట్ చీఫ్ ప్రకటన ఇంకా ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తున్నది. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక తర్వాతే స్టేట్ చీఫ్ ఎన్నికపై స్పష్టత రానున్నది. అయితే జాతీయ అధ్యక్షుడి ఎన్నికను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. ఎన్నికను పూర్తి చేసి పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలు, కార్యకలాపాలపై దృష్టి సారించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ అధ్యక్షుడు ఎవరు ఉండాలనే దానిపై అగ్రనేతల్లో క్లారిటీ రావట్లేదని తెలుస్తోంది. దీనిపై ఆర్ఎస్ఎస్అధినాయకత్వంతోనూ మీట్ అయ్యి స్పష్టత తీసుకుంటున్నట్టు సమాచారం.






