- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Raja Singh: సీఎంతో రహస్యంగా భేటీ అవుతుండ్రు.. సొంత పార్టీ నేతలపై రాజాసింగ్ సెన్సేషనల్ కామెంట్స్
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) కొన్నాళ్ల నుంచి పార్టీలో సైలంట్‌గా ఉంటూ వస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) కొన్నాళ్ల నుంచి పార్టీలో సైలంట్‌గా ఉంటూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు, సమావేశాలకు అరుదుగా హాజరవుతున్నారు. ఇటీవల జిల్లా అధ్యక్షుల ఎంపికపై కూడా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) సొంత పార్టీపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఈ మేరకు ఇవాళ ఆయన మీడియాకు సంచలన వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో రాజాసింగ్ మాట్లాడుతూ.. తెలంగాణ (Telangana)లో హిందువులు సేఫ్‌గా ఉండాలంటే బీజేపీ (BJP) అధికారంలోకి రావాలని అన్నారు.
రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలంటే పార్టీలో పాత వాళ్లను వెంటనే బయటకు పంపాలని కామెంట్ చేశారు. ముఖ్యంగా బీజేపీ అధిష్టానం ఈ విషయంలో ఆలోచన చేయాలని కోరారు. తెలంగాణ (Telangana)లో ఏ ప్రభుత్వం వస్తే.. ఆ సీఎం (CM)తో బీజేపీలోని కొందరు నేతలు రహస్యంగా భేటీ అవుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లందరికీ రిటైర్మెంట్ ఇస్తేనే తెలంగాణ బీజేపీకి మంచి రోజులు వస్తాయని రాజాసింగ్ కామెంట్ చేశారు. సొంత పార్టీ సీనియర్ నేతలపై ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.






