Raja Singh: ఖమేనీ పోతే బాధపడండి.. ఆందోళనలు దేనికి: MLA రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Raja Singh: ఖమేనీ పోతే బాధపడండి.. ఆందోళనలు దేనికి: MLA రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కారు. శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) మృతిపై ముస్లింలు చేస్తున్న నిరసనలను ఆయన ఖండించారు. ఎక్కడో ఎవరో చనిపోతే భారతదేశంలో ఆందోళనలు చేయాల్సిన అవసరం ఏముందని రాజాసింగ్ ప్రశ్నించారు.

‘ఖమేనీ చనిపోతే వ్యక్తిగతంగా బాధపడండి.. అంతేకానీ రోడ్లపైకి వచ్చి గందరగోళం చేయడం సరైన పద్ధతి కాదు’అని రాజాసింగ్ అన్నారు. గతంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ (B.R. Ambedkar) ఒక పుస్తకం రాశారని.. అందులో ‘భారతదేశంలో ఉన్న ముస్లింలు ఎప్పుడైనా దేశం కంటే మతానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు’ అని పేర్కొన్నట్లు గుర్తు చేశారు. భవిష్యత్తులో భారత్ ఏదైనా ఇస్లామిక్ దేశంపై దాడి చేస్తే.. మన దేశ ముస్లింలు దేశ రక్షణకు నిలబడతారా? లేక ప్రత్యర్థి దేశానికే మద్దతు ఇస్తారా? అని ఆయన నిలదీశారు.

Next Story