- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామచందర్ రావు రబ్బర్ స్టాంప్: రాజా సింగ్
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (BJP) అధ్యక్షుడు రామచందర్ రావుపై ( Ramachandra Rao) వివాదాస్పద వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (BJP) అధ్యక్షుడు రామచందర్ రావుపై ( Ramachandra Rao) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాజా సింగ్ ( Raja singh). తాజాగా ఓ మీడియా ఛానల్ తో రాజాసింగ్ మాట్లాడుతూ.... తెలంగాణ బిజెపి అధ్యక్షుడు రామచంద్ర రావు పై హాట్ కామెంట్స్ చేశారు. భారతీయ జనతా పార్టీకి రైటర్ కాదు.. ఫైటర్ కావాలంటూ పేర్కొన్నారు.
బండి సంజయ్ కుమార్ కు అధ్యక్ష పదవి ఇచ్చి ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉండేదని వివరించారు. రామచంద్రరావు భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ కాకూడదని చివరి వరకు అడ్డుకునే ప్రయత్నం చేశానని... చెప్పు కొచ్చారు రాజాసింగ్. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే.. సమూల మార్పులు జరగాలని కూడా వెల్లడించారు. అప్పుడే.. భారతీయ జనతా పార్టీ డెవలప్ అవుతుందని గుర్తు చేశారు రాజాసింగ్. ఇది ఇలా ఉండగా... ఇటీవలే భారతీయ జనతా పార్టీపై తిరుగుబాటు బావుట ఎగరవేశారు రాజాసింగ్. దీంతో అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసింది.






