- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Raja Singh: సొంత పార్టీకి మరోసారి షాకిచ్చిన రాజాసింగ్..! కీలక సమావేశానికి డుమ్మా
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని బీజేపీ దృష్టి సారించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ (Hyderabad district local body MLC election) ఎన్నికల్లో గెలవాలని బీజేపీ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం నాంపల్లి పార్టీ స్టేట్ ఆఫీస్‌లో కేంద్రమంత్రి, పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి (Kishan Reddy) అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు బీజేపీ కార్పొరేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ నెల 23న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికపై ప్రధానంగా చర్చించారు. ఓటింగ్‌కు కార్పొరేటర్లు గైర్హాజరు అవ్వకుండా కిషన్ రెడ్డి వారికి దిశానిర్దేశం చేశారు. మరోవైపు పెండింగ్ మండల అధ్యక్షుల ఎంపికపై చర్చలు జరిపినట్లు సమాచారం.
ఈ భేటీలో ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) మరోసారి పార్టీకి సమావేశానికి రాకుండా పార్టీ ఝలక్ ఇచ్చినట్లు సమాచారం. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో పార్టీ గెలవాలని పెట్టుకున్న సమావేశానికి నగరానికి చెందిన సీనియర్ నేత రాజాసింగ్ మళ్లీ డుమ్మా కొట్టారు. ఈ ఎమ్మెల్సీకి ఎంఐఎం పార్టీ ప్రధాన పోటిగా ఉందని తెలిసి కూడా రాజాసింగ్ భేటీకి హజరుకాకపోవడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత ఎంపీ ఎన్నికల సమయం నుంచి పార్టీలో జరిగే కీలక మీటింగ్‌లకు రాజాసింగ్ గైర్హాజరు అవుతూనే ఉన్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రంగంలోకి దిగినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హనుమాన్ జయంతి సందర్భంగా కేంద్ర సహాయం మంత్రి బండి సంజయ్ రాజాసింగ్‌ను కలిసి బుజ్జగింపులు చేసినట్లు టాక్ నడిచింది.
అయినా కూడా ఇవాళ జరిగిన బీజేపీ కీలక భేటీ హాజరుకాకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఓవైసీకి వ్యతిరేకంగా కనీసం ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారానికి అయిన వస్తారా? అని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వేరే పనిలో బీజీగా ఉండటం చేత సమావేశానికి రాజాసింగ్ హాజరుకాలేకపోయారా? అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఇవాళ తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజా ప్రాముఖ్యత కలిగిన వివిధ అంశాలపై చర్చలు జరిపినట్లు బండి సంజయ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.






