యూరియా కొరత అంశాన్ని పార్లమెంటులో నిలదీయండి : ఎంపీలకు తుమ్మల రిక్వెస్ట్

by Muthe.Rajitha |

తెలంగాణలో యూరియా కొరత అంశాన్ని పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ ఎంపీలను కోరారు.

యూరియా కొరత అంశాన్ని పార్లమెంటులో నిలదీయండి : ఎంపీలకు తుమ్మల రిక్వెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో యూరియా కొరత అంశాన్ని పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ ఎంపీలను కోరారు. రాష్ట్రంలో యూరియా కొరత సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర ఎంపీలను కోరారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో రైతులు తీవ్ర యూరియా కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తి, కేటాయింపుల ప్రకారం పూర్తిస్థాయిలో యూరియా సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

2024-25 సంవత్సరానికి తెలంగాణకు కేంద్రం 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించగా, జులై 31 నాటికి కేవలం 4.36 లక్షల టన్నులు మాత్రమే సరఫరా అయింది. దీంతో ఏడాదికి ఇంకా 2.24 లక్షల టన్నుల కొరత ఏర్పడింది. ఆగస్టు నెలలో 3.50 లక్షల టన్నుల అవసరం ఉండగా, కేవలం 1.70 లక్షల టన్నులు మాత్రమే సరఫరా కావడంతో రైతులు, ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న, వరి పంటలు సాగు చేసే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అయితే ఈ సమస్యను పరిష్కరించాలని మంత్రి తుమ్మల కేంద్ర ఎరువుల, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు ఇదివరకే లేఖలు రాసి, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) నుంచి స్వదేశీ యూరియా సరఫరాను 30,800 టన్నుల నుంచి 60,000 టన్నులకు పెంచాలని, ఏప్రిల్-జూన్ మధ్య తలెత్తిన లోటును భర్తీ చేయడానికి అదనపు కోటా కేటాయించాలని కోరారు.

Next Story