- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో తగ్గనున్న వర్షాలు.. నేడు పొడి వాతావరణం
తెలంగాణలో వర్షాలు తగ్గి ఈరోజు పొడి వాతావరణం ఉండనుంది. హైదరాబాద్‌లో 35°C లోపే ఉన్నా, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 43°C వరకు ఎండలు ఉంటాయి.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వింత వాతావరణం (weather) నెలకొంటున్న విషయం తెలిసిందే. ఉదయం నుంచి సాయంత్రం వరకు భారీ ఉష్ణోగ్రతలు, సాయంత్రం అకస్మాత్తుగా మారిన వాతావరణంతో వర్షాలు కురుస్తున్నాయి. కాగా నిన్న సాయంత్రం నుంచి కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. అయితే తాజాగా ఈ వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ తాజా అప్‌డేట్ ఇచ్చింది. పశ్చిమ తెలంగాణ (West TG) జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న వర్షాలు మరికొద్ది సేపట్లో పూర్తిగా తగ్గిపోనున్నాయి. బుధవారం (మే 27) మిగిలిన రోజంతా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ పొడి వాతావరణం (Mainly Dry Weather) నెలకుంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
గతరాత్రి కురిసిన నాన్‌స్టాప్ వర్షాలు, ప్రస్తుత ముసురు వాతావరణం (Cloudy Conditions) కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత కాస్త అదుపులోనే ఉండనుంది. తెలంగాణలోని మెజారిటీ ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగానే నమోదు కానున్నాయి. ముఖ్యంగా భాగ్యనగరం (HYD City) లో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల లోపే ఉండే అవకాశం ఉంది. అయితే, రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మాత్రం ఎండల ప్రభావం అలాగే కొనసాగుతుంది. హన్మకొండ, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఈరోజు కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, అక్కడ 41 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.






