తెలంగాణలో మళ్లీ మొదలైన వర్షం..ఈ జిల్లాల వాళ్లు బయటకు రావద్దు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-04-25 14:34:59  IST  )

తెలంగాణలో కాస్త గ్యాప్ ఇచ్చిన వరణుడు మళ్లీ బాదుడు మొదలు పెట్టాడు. రెండు రోజుల ఎండలు మండిపోతుండగా మళ్లీ ఈ రోజు వర్షం కురుస్తోంది.

తెలంగాణలో మళ్లీ మొదలైన వర్షం..ఈ జిల్లాల వాళ్లు బయటకు రావద్దు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కాస్త గ్యాప్ ఇచ్చిన వరణుడు మళ్లీ బాదుడు మొదలు పెట్టాడు. రెండు రోజుల ఎండలు మండిపోతుండగా మళ్లీ ఈ రోజు వర్షం కురుస్తోంది. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్,కామారెడ్డి, ఆసీఫాబాద్ జిల్లాలో వర్షం కురుస్తోంది. మెదక్, సంగారెడ్డి, గజ్వేల్‌లో భారీ పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణాన్ని అంచనా వేసే వెదర్ మ్యాన్ హెచ్చరించారు. ఇవి చాలా డేంజర్ అని కాబట్టి ఎవరూ బయటకు వెళ్లకుండా షెల్టర్ చూసుకోవాలని హెచ్చరించాడు. హైదరాబాద్‌లో చల్లటి వాతావరణం ఉంటుందని పేర్కొన్నాడు. ఇక వర్షం కరిస్తే కాస్త ఇబ్బంది అయినా ఎండల నుండి మాత్రం ఉపశమనం లభిస్తుందని ప్రజలు భావిస్తున్నారు.

Next Story