రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..

by Chukka Sudharani |

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండలు దంచికొడుతున్నాయి.

రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్న తరుణంలో వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా.. మరికొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు మే నెలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.

Next Story