- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రవ్యాప్తంగా తగ్గుముఖం పట్టిన వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాను బలహీనపడడంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మొన్నటి వరకు భారీ వర్షాలతో అతలాకుతలం చేసిన ఈ తుఫాన్ క్రమంగా బలహీనపడి ప్రస్తుతం వాయుగుండంగా మారింది.

దిశ, తెలంగాణ బ్యూరో: బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాను బలహీనపడడంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మొన్నటి వరకు భారీ వర్షాలతో అతలాకుతలం చేసిన ఈ తుఫాన్ క్రమంగా బలహీనపడి ప్రస్తుతం వాయుగుండంగా మారింది. తీరం దాటిన తర్వాత బలహీనపడిన మొంథా తుఫాన్, ప్రస్తుతం తూర్పు విదర్భ, దక్షిణ చత్తీస్ ఘడ్ ప్రాంతాలపై వాయుగుండంగా కేంద్రీక్రుతమై ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వాయుగుండం ప్రభావంతో వర్షాత తీవ్రత గణనీయంగా తగ్గిపోయింది. వాయుగుండం తూర్పు విదర్భ, దక్షిణ చత్తీస్ ఘడ్ ప్రాంతాల వైపు కదులుతోంది.
వాయుగుండం కారణంగా కొన్ని ప్రాంతాలలో చెదురుముదురుగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ, గత రెండు రోజులతో పోలిస్తే ప్రజలు ఊరట చెందవచ్చని వాతావరణ కేంద్రం తెలియజేసింది. భారీ వర్షాల హెచ్చరికలు ప్రస్తుతం లేనప్పటికీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ర్టంలోని ఆదిలాబాద్, కుమరంభీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. నిర్మల్ జిల్లా భైంసాలో 2 సెం.మీ, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో 2 సెం.మీ బోథ్ లో 2 సెం.మీ జగిత్యాల జిల్లా సారంగపూర్ లో 1.5 సె.మీ చొప్పన వర్షాపాతం నమోదైంది.






