- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరికొద్ది సేపట్లో తెలంగాణలోని ఈ జిల్లాలో వర్షాలు
తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చాయి

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల (Heavy rains) కారణంగా ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చాయి. వరుసగా వారం రోజులు కురిసిన వర్షాలు ఈ రోజు కాస్త విరామం ఇచ్చాయి. అయితే రానున్న మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (Department of Meteorology) అలర్ట్ జారీ చేసింది. తాజా అలర్ట్ ప్రకారం.. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాలో చెల్లాచెదురుగా వర్షాలు కురవనున్నాయి. అలాగే సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్ పరిసరాల్లో వర్షాలు కురుస్తాయి. అలాగే హైదరాబాద్‌లో నిన్నటి మాదిరిగానే.. నగరం మేఘావృతమై సాయంత్రం వరకు పొడిగా ఉండి.. సాయంత్రం తర్వాత చెదురుమదురు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే రేపటి నుంచి తెలంగాణ అంతటా వర్షాలు పెరుగుతాయని, సెప్టెంబర్ 1/2 నుండి హైదరాబాద్‌లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ అంచనా వేసింది.






