- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అరుదైన జన్యు చికిత్స సక్సెస్
భారతదేశంలో పిల్లలు, ప్రసూతి, గైనకాలజీ విభాగాల్లో అగ్రగామిగా ఉన్న రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ మరో ఘనతను సొంతం చేసుకుంది.

దిశ తెలంగాణ బ్యూరో: భారతదేశంలో పిల్లలు, ప్రసూతి, గైనకాలజీ విభాగాల్లో అగ్రగామిగా ఉన్న రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ మరో ఘనతను సొంతం చేసుకుంది. సికింద్రాబాద్‌లో ఒక చిన్నారికి విజయవంతంగా అరుదైన జన్యు చికిత్సను అందించింది. ఈ చిన్నారికి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (ఎస్.ఎం.ఎ) అనే వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో సికింద్రాబాద్‌లోని తమ ఆసుపత్రిలోని కన్సల్టెంట్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోనంకి పర్యవేక్షణలో జన్యు చికిత్స నిర్వహించారు. పీడియాట్రిక్ ఆరోగ్య సంరక్షణలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలిచిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
ఏమిటి ఈ చికిత్స?
ఈ చికిత్సా విధానంలో భాగంగా, ఆ చిన్నారికి జోల్జెన్స్మా అనే మందును ఇచ్చారు. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (ఎస్.ఎం.ఎ) వ్యాధికి చికిత్స చేయడానికి దీన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ వ్యాధికి కారణమైన ఎస్ ఎం ఎన్1 జన్యువును ఇది సరిచేస్తుంది. జోల్జెన్స్మాను ఒక ప్రత్యేకమైన వైరల్ వెక్టర్ (అడెనో-అసోసియేటెడ్ వైరల్ వెక్టర్) ద్వారా శరీరంలోకి ప్రవేశపెడతారు. ఈ చికిత్స ద్వారా మోటార్ న్యూరాన్‌లు మరింత కాలం జీవించడానికి, కండరాల పనితీరుకు అవసరమైన ఎస్ ఎం ఎన్ ప్రొటీన్ ఉత్పత్తికి దోహదం అవుతుంది. ఒక డోస్‌కు సుమారు రూ.14 కోట్లు ఖర్చయ్యే జోల్జెన్స్మా, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన చికిత్సలలో ఒకటిగా పరిగణించబడుతోంది.
ఇవీ గణంకాలు...
స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (ఎస్.ఎం.ఎ) అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10,000 మంది పిల్లలలో సుమారు ఒకరిని ప్రభావితం చేసే తీవ్ర జన్యుపరమైన నరాల, కండరాల సంబంధిత వ్యాధి. భారత్‌లో ఈ వ్యాధితో దాదాపు 1000 మంది పిల్లలు బాధపడుతున్నట్లు ఒక అంచనా. సకాలంలో చికిత్స అందించకపోతే, ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారుతుంది. వ్యాధి వేగంగా ముదురుతూ ఉండటం వల్ల శిశువులు రెండేళ్లకు మించి బతకట్లేదు. అయితే దేశం మొత్తంలో దీనికి చికిత్స అందించే కొన్ని ప్రత్యేకమైన ఆసుపత్రుల్లో రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్, సికింద్రాబాద్ ఒకటి. ఇలాంటి అత్యాధునిక జన్యు చికిత్సలను అందించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, బహుళ విభాగాల నైపుణ్యంతో బాటు అనుభవంతో కూడిన వైద్యులు ఇక్కడ ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జోల్జెన్స్మా చికిత్సను అందించడానికి అవసరమైన అనుభవం, బహుళ విభాగాల బృందం ఉన్న ఏకైక ఆసుపత్రి కూడా ఇదే కావడం గమనార్హం. చికిత్స అందించిన తర్వాత, బాధిత పిల్లలను నిపుణులైన వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తుంది. దీంతో ఏవైనా దుష్ప్రభావాలను గుర్తించడానికి, తద్వారా సకాలంలో వైద్యం అందించేందుకు వారానికోసారి పరీక్షలు నిర్వహిస్తారు.
భావోద్వేగానికి గురైన చిన్నారి తండ్రి..
చికిత్స విజయవంతమైన తర్వాత చిన్నారి తండ్రి వినీత్ చౌదరి భావోద్వేగానికి గురయ్యారు. "ఈ చికిత్స మా కుటుంబానికి కొత్త ఆశను అందించింది. రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ బృందం చూపిన వృత్తిపరమైన అంకితభావానికి తాము హృదయపూర్వకంగా కృతజ్ఞులమన్నారు. చికిత్స విజయవంతం కావడానికి ముందుకు వచ్చిన దాతలందరికీ తమ హృదయపూర్వక ధన్యవాదాలని పేర్కొన్నారు. ఈ మైలురాయి రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ నిబద్ధతను తెలియజేస్తుందని.. అరుదైన ప్రాణాంతక పరిస్థితులతో బాధపడుతున్న పిల్లలకు నాణ్యతతో కూడిన, సంరక్షణను, అధునాతన చికిత్సలకు అందించడంపై రెయిన్‌బో చిల్డ్రన్ ఆసుపత్రి నిరంతరం దృష్టి సారిస్తుందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.






