- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇవాళ ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు
తెలంగాణ, ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు పడనున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ, ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు పడనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాలలో పిడుగులు కూడా పడే ఛాన్స్ లు ఉన్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా, భూపాలపల్లి, ములుగు, నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, మెదక్, అదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలలో వర్షాలు ఉన్నట్లు వెల్లడించింది.
అంటే దాదాపుగా ఉత్తర తెలంగాణకు ఎక్కువ వర్షపాతం ఇవాళ నమోదు కానుంది. అదే సమయంలో ఏపీలో కూడా వర్షాలు ఇవాళ జోరుగా ఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి- మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడొచ్చు.






