రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

by Ajay Maddhiboyina |

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దౌసా జిల్లాలో ఢిల్లీ ముంబాయి ఎక్స్ ప్రెస్ హైవేపై వెళుతున్న బ‌స్సును ట్ర‌క్కు ఢీకొన‌డంతో మంట‌లు చెల‌రేగాయి. ఈ ప్ర‌మాదంలో బ‌స్సులోని ఏడుగురు స‌జీవ‌ద‌హ‌నం అవ్వ‌గా మ‌రో 15 మందికి గాయాలు అయ్యాయి.

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దౌసా జిల్లాలో ఢిల్లీ ముంబాయి ఎక్స్ ప్రెస్ హైవేపై వెళుతున్న బ‌స్సును ట్ర‌క్కు ఢీకొన‌డంతో మంట‌లు చెల‌రేగాయి. ఈ ప్ర‌మాదంలో బ‌స్సులోని ఏడుగురు స‌జీవ‌ద‌హ‌నం అవ్వ‌గా మ‌రో 15 మందికి గాయాలు అయ్యాయి. స‌మాచారం అంద‌డంతో పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు ప్రారంభించారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ బస్సు ఉత్తరాఖండ్‌ రిషికేశ్‌ నుంచి మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఘ‌ట‌న జ‌రిగిన ప్ర‌దేశంలో దృశ్యాలు క‌లిచివేసేలా క‌నిపిస్తున్నాయి. ప్ర‌మాద స‌మాచారం అంద‌డంతో ప్ర‌యాణికుల కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న చెందుతున్నారు. ఏడుగురు స‌జీవ‌ద‌హ‌నం అవ్వ‌డంతో మృత‌దేహాల‌ వివ‌రాలు క‌న్నుకోవ‌డం కూడా ఇప్పుడు స‌వాల్ గా మారింది. గ‌తంలో ఏపీలోనూ ఇలాంటి రోడ్డు ప్రమాదం జరిగిన సంగ‌తి తెలిసిందే. ఏపీలో బైక్ ను ఢీ కొట్టిన బ‌స్సు కొంత‌దూరం వ‌ర‌కు దూసుకెళ్ల‌డంతో మంట‌లు చెల‌రేగి ప్ర‌మాదం జ‌రిగింది. ఇప్పుడు రాజ‌స్థాన్ లోనూ అలాంటి ప్ర‌మాద‌మే జ‌ర‌గ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

Next Story