గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు.. రైతులు అప్రమత్తంగా సూచన

by Gantepaka Srikanth |

రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గతకొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో అల్లాడుతున్న సమయంలో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది.

గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు.. రైతులు అప్రమత్తంగా సూచన
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గతకొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో అల్లాడుతున్న సమయంలో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధిక వర్షాపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో అత్యధికంగా 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అకస్మాత్తుగా కురిసిన వడగళ్ల వానకు పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల మేర తగ్గనున్నాయి. సోమవారం సూర్యాపేట జిల్లా మట్టంపల్లిలో 3 సెం.మీ, నేరెడ్ చర్లలో 3 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 2 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా గార్లలో 2 సెం.మీ, సూర్యాపేట్ జిల్లా హుజుర్ నగర్ లో 2 సెం.మీ, మంచిర్యాల జిల్లా వెమన పల్లిలో 2 సెం.మీ చొప్పున వర్షాపాతం నమోదైంది.

Next Story